ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్‌ తయారీ యూనిట్లు
logo
Published : 07/05/2021 03:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్‌ తయారీ యూనిట్లు

స్థలాల పరిశీలనలో నిమగ్నమైన అధికారులు

తెనాలి జిల్లా ఆస్పత్రిలోని ఈ ఆక్సిజన్‌ నిల్వ ప్లాంట్ల పక్కనే ప్రాణవాయువు తయారీ యూనిట్‌ను నిర్మించనున్నారు

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే:  కరోనా మొదటి ‘వేవ్‌’ కన్నా రెండో వీచికలో ఆక్సిజన్‌ పెట్టాల్సిన బాధితుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిపోయింది. పెద్దాస్పత్రులకు ఈ అవసరం ఉన్నవారు పోటెత్తడంతో ఆయా దవాఖానాల్లోని ప్లాంట్లలో ఉన్న ప్రాణవాయువు త్వరగా అయిపోవడం పరిపాటి అయింది. ఇది అడుగంటే లోపు రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్లు వస్తాయో, రావోనని వైద్యులు ఆందోళనచెందిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఆస్పత్రుల్లోనే ప్రాణవాయువును తయారు చేసే ప్లాంట్లను నిర్మించే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. వాతావరణంలోని గాలి నుంచి ఆక్సిజన్‌ను వేరుచేసే యంత్ర పరికరాలను డీఆర్‌డీవో అందిస్తుండగా, నిర్మాణ పనులను ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా) చేపట్టనుంది.
ఇంతవరకు విశాఖపట్నం, ఒడిశా తదితర ప్రాంతాల్లో తయారైన ఆక్సిజన్‌ను ట్యాంకర్ల ద్వారా తెప్పించి ఆస్పత్రిలోని ప్లాంట్లలో నింపుతున్నారు. వీటి నుంచి ఆస్పత్రుల్లో పడకలకు బిగించిన గొట్టాల ద్వారా బాధితులకు అందిస్తున్నారు. ఆస్పత్రుల్లోని ఆక్సిజన్‌ ప్లాంట్లలో ప్రాణవాయువు నిల్వలు నిండుకున్న సందర్భాల్లో విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆక్సిజన్‌ అందక కొందరు చనిపోతున్న సందర్భాలూ చూస్తున్నాం. అదే ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్‌ తయారైతే ఇలాంటి ఇబ్బందులు దూరమవుతాయి.

స్థలాల పరిశీలన
ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్‌ అత్యధికంగా అవసరమైన ఆస్పత్రులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఆయా దవాఖానాలను పరిశీలిస్తున్నారు. అక్కడున్న వసతులను అధికారులను అడిగి తెలుసుకొంటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా గురువారం తెనాలి జిల్లా ఆస్పత్రిని వారు పరిశీలించారు. ఇప్పటికే ఇక్కడ 1 కె.ఎల్‌. ప్లాంట్లు రెండు ఉన్నాయి. అయినా ఇక్కడి అవసరాలకు ప్రాణవాయువు చాలడం లేదనే విషయాన్ని వైద్యాధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఆక్సిజన్‌ తయారీ యూనిట్‌ కోసం సివిల్‌ పనులు నిర్వహించాల్సిన స్థలాన్ని ఎంపిక చేశారు. ఆస్పత్రిలోని ఆక్సిజన్‌ ప్లాంట్ల పక్కనే ఈ స్థలం ఉంది. ఇందులో వారంలోపు 10 కె.ఎల్‌. సామర్థ్యంగల యూనిట్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో 300 చోట్ల ఇలాంటి యూనిట్లు నిర్మితం కానున్నాయని అధికారులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని