కొడాలి పాపారావుకు కన్నీటి వీడ్కోలు
logo
Published : 07/05/2021 03:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొడాలి పాపారావుకు కన్నీటి వీడ్కోలు

గూడవల్లి(చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే : అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్‌ వైద్య నిపుణుడు కొడాలి పాపారావు అంత్యక్రియలు కుటుంబ సభ్యుల అశ్రునయనాల నడుమ గురువారం ముగిశాయి. హైదరాబాద్‌ నుంచి గురువారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఆయన భౌతికకాయాన్ని తనకెంతో ఇష్టమైన గుంటూరు జిల్లా చెరుకుపల్లిలోని హరి మెమోరియల్‌ వైద్యశాలకు కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అక్కడ కొద్దిసేపు ఉంచి గూడవల్లిలోని నివాసానికి తరలించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కారాలు పూర్తిచేశారు. కుమారుడు డాక్టర్‌ కొడాలి వెంకటకృష్ణకుమార్‌ తండ్రి చితికి నిప్పంటించారు.
ప్రముఖుల సంతాపం..
పాపారావు మృతికి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు వేర్వేరు ప్రకటనల ద్వారా సంతాపం ప్రకటించారు. దశాబ్దాలుగా తీరప్రాంత ప్రజలకు వైద్యునిగా పాపారావు అందించిన సేవలు వెలకట్టలేనివని.. ఉచిత వైద్యంతో పేదల మనసును చూరగొన్న వైద్య నారాయణుడని కొనియాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని