అనారోగ్యంతో ‘విజ్ఞాన్‌’ జీఎం మృతి
logo
Published : 07/05/2021 03:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనారోగ్యంతో ‘విజ్ఞాన్‌’ జీఎం మృతి

పొన్నూరు, న్యూస్‌టుడే: విజ్ఞాన్‌ విద్యాసంస్థల జనరల్‌ మేనేజర్‌ గొంది ఉమామహేశ్వరరావు (75) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్‌ లావు రత్తయ్య వెంటనే వైద్యశాల వద్దకు వెళ్లి ఆయన భౌతిక కాయంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా విజ్ఞాన్‌ విద్యాసంస్థలకు ఉమామహేశ్వరరావు చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన మృతి తమకు తీరని లోటన్నారు.   విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఉప కులపతి డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, విజ్ఞాన్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.ఫణింద్రకుమార్‌, విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.శ్రీనివాసబాబు ఆయన మృతిపట్ల విచారం వ్యక్తంచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని