సరిపడా టీకాలు ఉంటేనే వ్యాక్సినేషన్‌: సజ్జల
logo
Published : 07/05/2021 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరిపడా టీకాలు ఉంటేనే వ్యాక్సినేషన్‌: సజ్జల

అమరావతి: సరిపడా టీకా నిల్వలు ఉండాలనే కానీ.. అన్ని రాష్ట్రాల కన్నా వేగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసే వ్యవస్థ ఏపీలో ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశాలపై విమర్శలు చేయడం తెదేపా అధినేత చంద్రబాబుకు తగదని హితవు పలికారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. కొవిడ్‌పై పోరులో ప్రభుత్వం పరిధిలో ఉన్న బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తోందని స్పష్టం చేశారు. ఒక్క రోజులో 6 లక్షలకుపైగా టీకా డోసులు వేసిన రాష్ట్రం ఏపీ అని గుర్తు చేశారు. రాష్ట్రానికి టీకాలు చేరుకున్నప్పటి నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిసేంత వరకు అధికారులు, ఉద్యోగుల, కింది స్థాయి సిబ్బంది సమన్వయంతోనే ఇది సాధ్యమైందని సజ్జల వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని