Published : 09/05/2021 07:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవిత్ర రాత్రి ‘షబ్‌ ఈ ఖదర్‌’ నేడే


విద్యుత్తు వెలుగులీనుతున్న తెనాలి మసీదు మినార్లు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: ఇస్లాం ధర్మంలో అత్యంత పవిత్రమైన, ఘనమైన రాత్రి అయిన ‘షబ్‌ ఈ ఖదర్‌’ను ఆదివారం నిర్వహించనున్నారు. ఈ పవిత్ర రాత్రి ముస్లిం సోదరులు జాగారం చేస్తూ, ప్రత్యేక ప్రార్థనల్లో నిమగ్నమై, అల్లాహ్‌ కృప కోసం దువా చేస్తారు. రంజాన్‌ నెల తొలి రోజు నుంచి మొదలు పెట్టిన ఖురాన్‌ పఠనాన్ని ఈ రోజున పూర్తి చేస్తారు. రంజాన్‌ మాసంలో 27వ రోజు రాత్రి ప్రత్యేకమైనది. మత పెద్దలు ఖురాన్‌ వెలుగులో జీవితాన్ని, పాటించాల్సిన విధివిధానాలను వివరిస్తారు. ఈ రాత్రినే ‘లైలతుల్‌ ఖద్ర్‌’ అని కూడా పిలుస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని