Published : 09/05/2021 07:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సర్వజనాస్పత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు


గజేంద్రకు డిశ్ఛార్జ్‌ పత్రాన్ని అందజేస్తున్న ప్రభావతి

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: అయినవారే ఆమడ దూరం పాటించే పరిస్థితుల్లో... కరోనా నియంత్రణకు సర్వజనాసుపత్రి ఉద్యోగులు అత్యుత్తమ వైద్య సేవలు అందించారని కొరిటెపాడుకు చెందిన సూరవరపు గజేంద్ర, లక్ష్మీసుజాత దంపతులు తెలిపారు. 40 రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి శనివారం రాత్రి డిశ్ఛార్జి చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. కొవిడ్‌ లక్షణాలను గుర్తించడంలో జాప్యం జరిగినందున, అత్యవసర వైద్యం కోసం జీజీహెచ్‌లో చేరామన్నారు. ముందు వరుసలో నిలబడి రోగులకు నిరుపమాన సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పాత్ర ఎంతో ప్రశంసనీయమన్నారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది రాత్రనకా, పగలనకా సేవలు, మనోధైర్యం అందిస్తున్నారన్నారు. వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అనంతరం గజేంద్రను సూపరింటెండెంట్‌ ప్రభావతి సత్కరించి, డిశ్ఛార్జి ధ్రువపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో సతీశ్‌కుమార్‌, జూనియర్‌ వైద్యుల సంఘం అధ్యక్షుడు అచ్యుత్‌, జీజీహెచ్‌ నోడల్‌ అధికారి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.ల


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని