Updated : 09/05/2021 08:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్సై, కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

చుండూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లాలోని చుండూరు పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ శ్రావణి, అదే స్టేషన్‌లో పనిచేస్తూ ఒకరోజు ముందు వీఆర్‌లోకి వెళ్లిన కానిస్టేబుల్‌ రవీంద్ర పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. సేకరించిన వివరాల ప్రకారం శ్రావణి గత ఏడాది అక్టోబరులో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. రవీంద్ర అయిదేళ్ల నుంచి ఇక్కడే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన ఎస్‌ఐ శ్రావణితో సన్నిహితంగా మెలిగేవాడని తెలిసింది. అయితే ఏమైందో తెలియదు కానీ వీరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయంపై చుండూరు సీఐ రమేష్‌బాబును వివరణ కోరగా ఎస్‌ఐ శనివారం స్టేషన్‌కు రాలేదని, వారిద్దరు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారనే విషయం తెలియదని చెప్పారు. అయితే వారిద్దరే కారులో వెళ్లి ముందుగా తెనాలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరారని పేర్కొన్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 ద్వారా గుంటూరులోని వేర్వేరు ప్రైవేటు వైద్యశాలలకు తరలించినట్టు చెప్పారు. వారు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని, సాధారణ స్థితిలోకి వచ్చిన తరవాత వివరాలు తెలియజేస్తామని సమాధానమిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని