Updated : 09/05/2021 08:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముఖం చాటేసిన పేగు బంధం


మృతి చెందిన గంగమ్మ

ఎల్‌ఎన్‌పురం(నందివాడ), న్యూస్‌టుడే: కరోనాతో కొన్ని రోజులుగా బాధ పడుతున్న వృద్ధురాలు ఇంటి గుమ్మం ముందే పడిపోయి మృతి చెందిన సంఘటన నందివాడ మండలం ఎల్‌ఎన్‌పురంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... ఎల్‌ఎన్‌పురానికి చెందిన గంగమ్మ(79) ఇటీవల హైదారాబాద్‌లోని ఆమె కుమార్తె వద్దకు వెళ్లొచ్చింది. నాలుగు రోజులుగా ఆమెకు ఆరోగ్యం బాగోలేదు. దీంతో రామాపురంలోని పీహెచ్‌సీకి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె పిల్లలు ఇంటికి రాకుండా ముఖం చాటేశారు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఆమె శనివారం ఇంటి గుమ్మం ముందే పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. గ్రామ పెద్ద నాగూర్‌, పంచాయతీ సిబ్బంది ఆమె పిల్లలకు కబురు పంపారు. ఎవరూ స్పందించకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు.


అంత్యక్రియలు నిర్వహిస్తున్న పంచాయతీ సిబ్బంది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని