Published : 09/05/2021 07:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవ్వకు ఎంత కష్టం!


సామాన్లు బయట పడేయడంతో దిగాలుగా కూర్చుని...

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ బారిన పడిన పాపానికి ఆ వృద్ధురాలు కట్టుబట్టలతో నడిరోడ్డున పడాల్సి వచ్చింది. ఉన్న ఇల్లును కొడుకు అమ్మేయగా.. అద్దె ఇంట్లో ఉంటున్న ఆమెను యజమాని సామాన్లతో సహా వీధిన పడేసిన ఘటన జగ్గయ్యపేటలోని పద్మావతినగర్‌లో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న బొజ్జా సామాజ్య్రం కొడుకు ఇంటిని అమ్మేయడమే కాకుండా ఒంటరిగా వదిలేశాడు. దీంతో అద్దె ఇంట్లో ఉంటూ పింఛను డబ్బుతో జీవిస్తోంది. ఆమెకు కరోనా వచ్చిందని యజమాని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దిక్కుతోచక సామాన్లతో సహా రోడ్డుపై కూర్చున్న ఆమెను సచివాలయ సంక్షేమ కార్యదర్శి చూసి విషయం పోలీసులకు తెలిపారు. ఎస్‌ఐ చినబాబు యజమానిని మందలించి ఆమెను తిరిగి ఇంటిలోకి పంపించారు. సమాచారం తెలిసి ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను స్పందించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆమెను చేర్చుకొని చికిత్స అందించాలని అధికారులకు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని