Published : 09/05/2021 07:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ ఏజెన్సీలపై నిఘా


ఫిల్లింగ్‌ కేంద్రం వద్ద వివరాలు సేకరిస్తున్న జేసీ శివశంకర్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఆక్సిజన్‌ రవాణా, పంపిణీ తదితరాలపై జేసీ ఎల్‌.శివశంకర్‌ నగరంలోని తమ విడిది కార్యాలయంలో శనివారం సమీక్షించారు. అనంతరం నగరంలోని విన్‌ గ్యాస్‌ ఏజెన్సీ ఫిల్లింగు పాయింటును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రాణ వాయువుకు ఎలాంటి కొరత లేదన్నారు. సిలిండర్లలో ఆక్సిజన్‌ను నింపే (ఫిల్లింగు) ఏజెన్సీలపై నిఘా ఉంచినట్టు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించినా, ప్రాణ వాయువును అక్రమంగా నల్లబజారుకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్సిజన్‌ రవాణా వాహనాలను గ్రీన్‌ ఛానల్‌ ద్వారా జిల్లాకు తీసుకురావడంలో నగర పోలీసు కమిషనరు బత్తిన శ్రీనివాసులు, ఎస్పీ రవీంద్రనాథ్‌లు సహకరిస్తున్నట్టు పేర్కొన్నారు. వివిధ ఏజెన్సీల ద్వారా సిలిండర్లలో ఆక్సిజన్‌ను నింపి, కొవిడ్‌ చికిత్స ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అర్ధరాత్రి వేళల్లోనూ తనిఖీలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రాణ వాయువు సరఫరాలో సమస్యలు తలెత్తకుండా విజయవాడలో సెంట్రలైజ్డు ఆక్సిజన్‌ యూనిట్‌ను సిద్ధంగా ఉంచినట్టు వెల్లడించారు. సాంకేతిక సమస్యల వల్ల విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి ఈనెల 4, 5 తేదీల్లో రావాల్సిన ఆక్సిజన్‌ నిలిచిపోగా, కలెక్టరు ఇంతియాజ్‌ చొరవతో ప్రైవేటు కంపెనీ నుంచి 20 మెట్రిక్‌ టన్నుల ప్రాణ వాయువును కొనుగోలు చేసి, ఆసుపత్రులకు సరఫరా చేసినట్టు తెలిపారు. పెద్ద సమస్య నుంచి బయట పడ గలిగినట్టు పేర్కొన్నారు. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జిల్లాకు 303 టన్నుల ఆక్సిజన్‌ వచ్చినట్టు వివరించారు. రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా ప్రాణ వాయువును తీసుకువస్తున్నామని, మానిటరింగు సెల్‌ ద్వారా 24 గంటలూ పర్యవేక్షిస్తున్నట్టు జేసీ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని