Published : 09/05/2021 07:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేతనాలు అడిగితే.. ఉద్యోగాల నుంచి తొలగిస్తారా?


స్టేడియంలోని కొవిడ్‌ పరీక్ష కేంద్రం వద్ద నిరసన తెలియజేస్తున్న బాధితులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: కొవిడ్‌ కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించిన తమకు వేతనాలు ఇవ్వడం లేదని, అడిగితే ఉద్యోగాల నుంచి తొలిగించామని చెబుతున్నారని నిర్ధారణ పరీక్షలు చేసే సిబ్బంది శనివారం స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలోని కొవిడ్‌ పరీక్ష కేంద్రం వద్ద నిరసనకు దిగారు. జిల్లా ఆపరేషన్‌ మేనేజర్‌ గణేష్‌ ఎదుట తమ ఆవేదన వెలిబుచ్చారు. గత ఏడాది జూన్‌లో జిల్లాలోని సుమారు 250 మంది ఈ విధుల్లో చేరారని, జీతం సరిగా ఇచ్చేవారు కాదని, విధుల నుంచి తొలగించే నాటికి మూడు నెలల బకాయి ఉందని వారు పేర్కొన్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు అందాల్సి ఉందని చెప్పారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు, నగర పోలీసు కమిషనర్‌కు కూడా ఫిర్యాదు కూడా చేశామన్నారు. విడతల వారీగా గడువు కోరుతూ జీతం ఇవ్వకుండా దాటవేస్తున్నారని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని జిల్లా ఆపరేషన్‌ మేనేజర్‌ గణేష్‌ చరవాణి ద్వారా సంబంధిత కంపెనీ అధికారులతో మాట్లాడించారు. సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ఆదివారం తెలియజేస్తానంటూ వారు బదులిచ్చారు. పోలీసులు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని