Published : 09/05/2021 07:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దంపతులను కబళించిన కరోనా

భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

విద్యాధరపురం, న్యూస్‌టుడే: కరోనాతో భర్త మృతి చెందగా, మనస్తాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలో శనివారం చోటుచేసుకుంది. భవానీపురం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన చెన్నగిరి మురళీకృష్ణ(32) ఆటోనగర్‌లోని స్టీల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతడి భార్య విజయలక్ష్మి(28) గృహిణి. ఏప్రిల్‌ 30న దంపతులు అనారోగ్యానికి గురికాగా, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించగా పాజిటివ్‌ వచ్చింది. స్థానిక వైద్యుని వద్ద వీరు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం మురళీకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. దీంతో తీవ్రంగా కలత చెందిన విజయలక్ష్మి శనివారం వేకువజామున దుప్పటితో ఫ్యానుకు ఉరివేసుకుంది. మురళీకృష్ణ సోదరుడు పూర్ణప్రభాకర్‌ ఉదయం 9గంటలకు పరామర్శ కోసం ఫోను చేయగా స్పందన లేకపోవడంతో, కుటుంబ సభ్యులతో కలిసి సోదరుని ఇంటికి వచ్చాడు. తలుపులు వేసి ఉండటంతో స్థానికుల సహకారంతో గడియ విరగొట్టి చూడగా అప్పటికే విజయలక్ష్మి చనిపోయి ఉంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎఎస్‌ఐ వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని