Published : 09/05/2021 07:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం విఫలం


మాట్లాడుతున్న దేవినేని ఉమా

విద్యాధరపురం, న్యూస్‌టుడే: కొవిడ్‌ బాధితులకు ప్రాణవాయువు, చికిత్స అందించడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపుమేరకు రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురావాలని, బాధిత కుటుంబాలకు చికిత్స అందించాలని కోరుతూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హైదరాబాద్‌లోని స్వగృహంలో నిరసన దీక్షను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మందులు, ఆక్సిజన్‌, వెంటిలేటర్ల బెడ్స్‌ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వ పెద్దలు, అధికారులు వినిపించుకోవడం లేదని విమర్శించారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు ధోరణి విడనాడి, బాధితులకు చికిత్స అందించాలని సూచించారు. శ్మశానవాటికలో దహనానికి సైతం అంబులెన్సుల్లో మృతదేహాలు బారులు తీరడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రజలకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో సైతం విఫలమైందని ఆరోపించారు. పేద, మధ్యతరగతి వర్గాలు బ్లాక్‌ మార్కెట్‌లో ఇంజన్షన్లు కొనలేక, వైద్యం చేయించకోలేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని