Published : 09/05/2021 07:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మ మలిచిన శిల్పాన్ని..!

బాపట్ల, న్యూస్‌టుడే

గంగాధరం, అడ్మిన్‌ ఎస్పీ, గుంటూరు అర్బన్‌

అమ్మ ప్రేమ అమితమైంది.. బిడ్డలపై అంతులేని ఆప్యాయత.. అనురాగం చూపిస్తుంది.. పిల్లల ఎదుగులకు ఎన్నో త్యాగాలు చేస్తుంది.. అలుపెరగని ఓర్పుతో వ్యవహరిస్తుంది.. తన ఎదుగుదలలో అమ్మ వెంకటసుబ్బమ్మ కీలకపాత్ర పోషించిందని.. ఆమే తనకు స్ఫూర్తి ప్రదాత అని గుంటూరు అర్బన్‌ అడ్మిన్‌ ఎస్పీ డి.గంగాధరం పేర్కొన్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’తో ఆయన శనివారం ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

వెంకట సుబ్బమ్మ, తల్లి

* నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలో పాపిరెడ్డిపల్లి మా సొంతూరు. వ్యవసాయ ఆధారిత కుటుంబం. అమ్మ చదువుకోకపోయినా విద్య ప్రాధాన్యం గుర్తించారు. బాగా చదివేలా నన్ను ప్రోత్సహించారు. కుటుంబం బాగుండాలని తపన పడేవారు. మా గ్రామానికి కి.మీ. దూరంలో ఉన్న రావులపాడులో పాఠశాల ఉంది. నన్ను, ఇద్దరు అక్కలను పొలం గట్లపై వేలు పట్టుకుని రోజూ పాఠశాలకు తీసుకెళ్లింది. బాగా చదివితేనే జీవితం బాగుపడుతుందని చెప్పేది. కుటుంబం కోసం కష్టపడి పని చేసింది. ఆమె ప్రోత్సాహంతోనే డిగ్రీ, పీజీ చదివి పోలీస్‌శాఖలో ఎస్సైగా చేరి సీఐ, డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీ స్థాయికి ఎదిగాను. కోడలిని కన్నకూతురిలా చూసుకుంటోంది. ఓ మహిళగా కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టి పరిపూర్ణ విజయం సాధించింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని