Updated : 09/05/2021 07:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగన్‌ అసమర్థతతో ప్రజల ప్రాణాలు పోతున్నాయ్‌

నిరసన తెలిపిన తెదేపా నాయకులు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: జగన్‌ అసమర్థత, నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలసి పోతున్నాయని తెదేపా నేతలు ఆరోపించారు. కరోనా నియంత్రణలో వైకాపా ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందంటూ గుంటూరులోని తమ నివాసాలు, పార్టీ కార్యాలయాల్లో వేర్వేరుగా మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, గుంటూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, పార్టీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నా, వైరస్‌ కట్టడిపై సీఎం జగన్‌ దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష పార్టీ నేతలను అణచివేయడం, వేధించడంపైనే శ్రద్ధ చూపుతున్నారన్నారు. రంగులకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో సగం వెచ్చిస్తే ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయొంచొచ్చన్నారు. కేవలం రూ.1600 కోట్లు వ్యాక్సిన్‌కు కేటాయించలేరా....అని ఆనందబాబు నిలదీశారు. తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ ఉచితంగా అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించి, అక్టోబర్‌ వరకు వేయలేమని చెప్పడం వైకాపా అమసర్థతకు నిదర్శనమన్నారు.


నిరసన తెలియజేస్తున్న నక్కా ఆనందబాబు

ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ కరోనాతో బాధపడుతున్న ఒక్క రోగికైనా సీఎం జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఎవ్వరూ సాయం అందించిన దాఖలాలు లేవు. మీ చావు మీరు చావండి...అన్న దోరణిలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రన్న బీమా ఉంటే రూ.10 లక్షల పరిహారం వచ్చి ఉండేది. దానిని అటకెక్కించారు. కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.35,000 వచ్చేవన్నారు. ఆయా నిరసన కార్యక్రమాల్లో ఆలపాటి మాధవి, నాయకులు శాఖమూరి నారాయణప్రసాద్‌, చిట్టాబత్తిన చిట్టిబాబు, కంచర్ల శివరామయ్య, కార్పొరేటర్లు కొమ్మినేని కోటేశ్వరరావు, ఎల్లావుల అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని