Published : 09/05/2021 07:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కారు ఢీకొని రైతు దుర్మరణం


దెబ్బతిన్న కారు

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ ఆ యువకులు ఓ రైతును బలి తీసుకున్నారు. ద్విచక్రవాహనంపై వస్తున్న ఆయన్ను ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఉదంతం భట్టిప్రోలు శివారులో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన రైతు పోతాబత్తుని వెంకట సుబ్బారావు(51) వరి నూర్పిళ్లు చేయిస్తున్నారు. కూలీలకు చల్లటి పానీయాలు తీసుకొచ్చేందుకు ఆయన భట్టిప్రోలు వచ్చి వాటిని కొనుగోలు చేశారు. తిరిగి పొలానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కోడిపర్రు వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఆయన్ను ఢీకొట్టి, సమీప పొలాల్లోకి ఈడ్చుకెళ్లింది. దీంతో వెంకట సుబ్బారావు తల, కాళ్లు, చేతులు పూర్తిగా నుజ్జు కావడంతో ఆయన ప్రాణాలు విడిచారు. కారు ముందుభాగం దెబ్బతింది. ఆ సమయంలో కారులో మండలంలోని కోళ్లపాలేనికి చెందిన నీలా శివరామకృష్ణ, మేరుగ కిరణ్‌కుమార్‌, దోవా రమేష్‌, దోవా ప్రకాష్‌, నీలా శరత్‌బాబు ఉన్నారు. తాగిన మత్తులో ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లో ఉంచారు. ఎస్సై శామ్యూల్‌రాజ్‌కుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని