ప్రాణవాయువు సరఫరా పర్యవేక్షణకు బృందాలు
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాణవాయువు సరఫరా పర్యవేక్షణకు బృందాలు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ఆక్సిజన్‌ సరఫరాను పర్యవేక్షించడానికి ఏడు బృందాలు ఏర్పాటు చేసినట్టు జాయింటు కలెక్టరు ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. ప్రాణ వాయువు ఉత్పత్తి, కొనుగోలు, రవాణా, వినియోగం వంటి అంశాల వారీగా ఆయా బృందాలు పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు. నగరంలోని కొవిడ్‌ కంట్రోలు కేంద్రంలో పర్యవేక్షక బృందంతో మంగళవారం సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ.. ప్రతి ఆసుపత్రికి ఆక్సిజన్‌ అవసరతను అంచనా వేసి, సరఫరా ఏర్పాట్లపై రెండు బృందాలు మూడు షిఫ్టులుగా 12 మంది పని చేస్తారని తెలిపారు. ఒడిశా, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ వాహనాలు జిల్లాకు చేరే వరకు అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రులు, పిన్నమనేని, నిమ్రా ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా, వినియోగం, నిల్వలు తదితరాలను ఎప్పటికప్పుడు తెలసుకోనున్నట్లు చెప్పారు. లిక్విడ్‌ ఆక్సిజన్‌ కేటాయింపులు, ఆక్సిజన్‌ వాడక ఆడిట్‌, ప్రైవేటు సరఫరాదారుల నుంచి కొనుగోళ్లు చెల్లింపులకు ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మూడు షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులను పరిశ్రమల శాఖ జోనల్‌ మేనేజరు మురళీకృష్ణా, ఏపీఐఐసీ జిల్లా మేనేజరు నాయుడు, డిప్యూటీ తహసీల్దారు చిట్టిబాబు సమన్వయం చేసుకుంటారని జేసీ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని