జులై 15 నాటికి రాష్ట్రంలో కరోనాకు ముగింపు
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జులై 15 నాటికి రాష్ట్రంలో కరోనాకు ముగింపు

ఇంజినీరింగ్‌ విద్యార్థుల బృందం నివేదిక

మంగళగిరి, న్యూస్‌టుడే: కొవిడ్‌ వ్యాప్తి ముగింపు కాలాన్ని అంచనా వేస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద నీరుకొండలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం విద్యార్థుల బృందం తయారు చేసిన అంచనా నివేదికను విశ్వవిద్యాలయం ప్రో వైస్‌ ఛాన్సలర్‌ డి.నారాయణరావు మంగళవారం విడుదల చేశారు. ప్రొఫెసర్‌ సౌమ్యజ్యోతి బిస్వాస్‌, కంప్యూటర్‌ సైన్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులు అన్వేష్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, సాయికృష్ణ, సుహాస్‌రెడ్డి శాస్త్రీయంగా ఈ నివేదిక రూపొందించారని అన్నారు. ఈ నివేదికను ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌కి ఈ-మెయిల్‌ ద్వారా పంపినట్టు చెప్పారు. ఈనెల 30వ తేదీకి కేవలం 5 వేల పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదవుతాయన్నారు. జులై 15 నాటికి కరోనా పాజిటివ్‌ కేసులు 100 కంటే తక్కువ ఉంటాయని మిషన్‌ లెర్నింగ్‌ ఆల్గారిథమ్‌తో అంచనా వేసినట్టు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న ఎస్‌.ఐ.ఆర్‌.(సస్పెక్టబుల్‌ ఇన్‌ఫెక్టెడ్‌ అండ్‌ రికవరీ మోడల్‌) సాయంతో ర్యాండమ్‌ ఫారెస్ట్‌ మిషన్‌ లెర్నింగ్‌ ఆల్గారిథమ్‌ సాయంతో ఈ డేటా తయారు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా రోజువారీ పాజిటివ్‌ కేసులు, రికవరీ డేటాతో ఎస్‌.ఐ.ఆర్‌. డేటా అనుసంధానం చేస్తే కరోనా వ్యాప్తి అంచనాలు స్పష్టమయ్యాయని ఆయన వివరించారు. మార్చి 3వ తేదీ నుంచి గణాంకాలను విశ్లేషించిన బృందం.. ఈ నెల 21 నాటికి రాష్ట్రంలో 10 వేల పాజిటివ్‌ కేసులు ఉంటాయని చెప్పిందన్నారు. ఈనెల 30వ తేదీకి 5 వేలు, జూన్‌ 14వ తేదీకి వెయ్యి, జూన్‌ 23 నాటికి 500, జులై 15కి కేవలం 100 కంటే తక్కువ పాజిటివ్‌ కేసులు ఉంటాయని ఆ బృందం అంచనా వేసిందని ప్రోవైస్‌ ఛాన్సలర్‌ డి.నారాయణరావు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని