Corona: వైరస్‌ సోకిందని కాలువ‌లో దూకి..
logo
Updated : 12/05/2021 07:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: వైరస్‌ సోకిందని కాలువ‌లో దూకి..

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: కరోనా సోకి కొందరు మృతి చెందుతుంటే.. కొవిడ్‌ బారిన పడి ఆందోళనకు గురై మరికొందరు తనువు చాలిస్తున్నారు. అటువంటి సంఘటనే ఇబ్రహీంపట్నంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక ఖాజీ మాన్యంకు చెందిన ఎగిటల కుమారి(50) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త నాలుగు సంవత్సరాల కిందట మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహం చేశారు. చిన్న కుమారుడు, కుమార్తెతో కలిసి ఆమె ఉంటోంది. నాలుగు రోజుల కిందట జ్వరం రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత మూడు రోజులకు పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. ఆ విషయాన్ని వైద్య సిబ్బంది ఆమెకు తెలియజేశారు. పూట గడిచేందుకు కష్టంగా ఉన్న పరిస్థితిలో కరోనా చికిత్స పొందాలంటే ఎక్కువ డబ్బు అవసరమవుతుందని భావించింది. తాను బిడ్డలకు భారం కాకూడదనుకుంది. ఎన్టీటీపీఎస్‌ చన్నీటి కాలువలో దూకింది. గమనించిన బంధువులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకొన్న పోలీసులు సంస్థ టన్నెల్‌ వద్ద మృతదేహాన్ని బయటకు తీసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ శ్రీధర్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని