453 మంది బాధితులకు చికిత్స
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

453 మంది బాధితులకు చికిత్స

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి పిన్నమనేని కొవిడ్‌ ఆసుపత్రిలో రెండో దశ సేవలు రెట్టింపుగా కొనసాగుతున్నాయి. ఆసుపత్రి నోడల్‌ అధికారిగా నియమితులైన మత్స్య శాఖ జేడీ లాల్‌మహ్మద్‌ ఆధ్వర్యంలో సుమారు 130 మందికి పైగా వైద్యులు, 60 మంది నర్సులు, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం నాటికి సుమారు 453(అత్యవసర ఆక్సిజన్‌ 250, ఐసీయూ 20, ఇతరులు) మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ నిల్వ సామర్ద్థ్యం 8.0 కిలో లీటర్లు కాగా.. ప్రభుత్వం నిత్యం కేవలం 5.0 కిలో లీటర్లు మాత్రమే అందజేస్తోంది. రోజూ మరో 3.0 కిలో లీటర్ల ఖాళీ ఉంటుంది. పెరుగుతున్న రోగుల దృష్ట్యా నిత్యం మిగిలిన ఆక్సిజన్‌ ట్యాంక్‌ను కూడా నింపాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా మరో 40 మంది రోగులు మంగళవారం ఆసుపత్రిలో చేరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని