పని వేళలు మార్చాలని వర్సిటీ ఉద్యోగుల ఆందోళన
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పని వేళలు మార్చాలని వర్సిటీ ఉద్యోగుల ఆందోళన

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: కరోనా విజృంభిస్తున్న తరుణంలో విశ్వవిద్యాలయ పని వేళలను మార్చాలని ఎన్టీఆర్‌ యూహెచ్‌ఎస్‌ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేస్తుంది. ఈ నెల 4వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ వేళలు విధించడంతో విశ్వవిద్యాలయాల పని వేళలను ఉదయం 8గంటల నుంచి 11.30 గంట వరకు కుదించారు. అయితే ఇకపై ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేసి తీరాల్సిందేనని వర్సిటీ రిజిస్ట్రార్‌ సోమవారం ఆదేశాలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు.. ఆయనను కలసి వినతి పత్రం అందజేయగా, అత్యవసర కార్యాలయాలు సాయంత్రం వరకు పనిచేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని బదులిచ్చారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి, ముఖ్య కార్యదర్శికి ఉద్యోగులు మంగళవారం ఫిర్యాదు చేశారు. పనివేళల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రబాబు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని