ఆసుపత్రిపై కేసు నమోదు
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసుపత్రిపై కేసు నమోదు

కృష్ణలంక, న్యూస్‌టుడే: అనుమతులు లేకుండా కొవిడ్‌ బాధితులను చికిత్స చేస్తున్న ఆసుపత్రిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక నల్లగేటు సమీపంలోని శ్రీరామ్‌ హాస్పిటల్స్‌లో కొవిడ్‌ బాధితులను చికిత్సను అందజేస్తున్నారన్న సమాచారంతో మంగళవారం సాయంత్రం కృష్ణలంక పోలీసులు సోదాలు చేపట్టారు. సుమారు 22 మందిని ఇన్‌పేషెంట్స్‌గా ఉన్నట్టు గుర్తించారు. నిబంధనలు పాటించని ఆసుపత్రి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో దంతవైద్యుడైన శివరామకృష్ణ.. వెంకటేశ్వరపురం రామయ్య వీధిలోని అచ్యుత్‌ ఎన్‌క్లేవ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని