11,504 మంది జ్వర పీడితుల గుర్తింపు
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

11,504 మంది జ్వర పీడితుల గుర్తింపు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌: జిల్లాలో చేపట్టిన సర్వేలో 11,504 మందికి జ్వరాలు ఉన్నట్టు గుర్తించినట్టు కలెక్టరు ఇంతియాజ్‌ తెలిపారు. మంగళవారం 4,776 నమూనాల నివేదికలు రాగా, వీరిలో 385 మందిని కరోనా పాజిటివ్‌గా నిర్ధారించినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అశోక్‌ కుమార్‌ సింఘాల్‌ జూమ్‌ కాన్ఫరెన్సు ద్వారా మంగళవారం రాత్రి కొవిడ్‌పై సమీక్షించారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి కలెక్టరు పాల్గొని జిల్లాలోని పరిస్థితిని వివరించారు. 76 కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4,410 పడకల ద్వారా బాధితులు చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఇంకా 231 పడకలు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టరు ఎం.సుహాసినీ, జడ్పీ సీఈవో సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని