పడకల కేటాయింపులో అక్రమాలు జరిగితే శిక్ష తప్పదు
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పడకల కేటాయింపులో అక్రమాలు జరిగితే శిక్ష తప్పదు

సమీక్ష నిర్వహిస్తున్న ప్రశాంతి పక్కన ప్రభావతి

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: సర్వజనాసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు పడకల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై వేటు తప్పదని జిల్లా సంయుక్త పాలనాధికారి ప్రశాంతి హెచ్చరించారు. జీజీహెచ్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రశాంతి మాట్లాడుతూ దిగువశ్రేణి ఉద్యోగులు కొందరు ఉన్నత స్థాయి అధికారుల పేర్లు చెప్పి పడకలు కేటాయిస్తున్నారనే ఆరోపణలపై విచారణ చేయిస్తామన్నారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా శిక్ష అనుభవించక తప్పందన్నారు. ప్రాథమిక విచారణలో దోషులుగా తేలిన కొందరిపై ఇప్పటికే వేటు వేశామన్నారు.    ఆసుపత్రిలో ఎంతమంది రోగులు చికిత్స పొందుతున్నారు? ఎన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో ఆన్‌లైన్‌లో కనిపించాలన్నారు. రోగి చేరినప్పటి నుంచి డిశ్ఛార్జి అయ్యేవరకూ అందించిన చికిత్స వివరాలన్నింటినీ నమోదు చేయాలన్నారు. ఇందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. వీరి పనితీరు బాగా లేకపోతే వెంటనే విధుల నుంచి తొలగించాలన్నారు.  సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ శుభం బన్సాల్‌, సూపరింటెండెంట్‌ ప్రభావతి, నోడల్‌ అధికారి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని