Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో తెలియజేయండి

నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: భవిష్య నిధి ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని(కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు) పెన్షనర్లు వారి ఫిర్యాదులు, దర్యాప్తులు ఆన్‌లైన్‌ ద్వారా తెయజేయవచ్చని ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ కుందన్‌ అలోక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12వతేదీ పెన్షన్‌ అదాలత్‌లో వీటి పరిష్కారానికి చర్యలుంటాయన్నారు. కార్యాలయం పని దినాల్లో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లో సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఫిర్యాదులు ఏవైనా ఉంటే ro.guntur@epfindia.gov.in మెయిల్‌ ద్వారా గానీ, 94946 57649 నెంబరుకు వాట్సాప్‌ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. కార్యాలయం పని వేళల్లో 0863- 2344106, 2232921 నెంబర్లలో సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని