Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనారోగ్యంతో పెదకాకాని సర్పంచి మృతి

మాధవీలత (పాత చిత్రం)

పెదకాకాని, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతూ పెదకాకాని సర్పంచ్‌ మండే మాధవీలత(47) మంగళవారం మృతిచెందారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థినిగా ఈమె 1128 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. గత ఇరవై రోజులుగా ఈమె ఒంగోలులోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. గుంటూరు పాలిక ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక  ఆటోనగర్‌ ‘వై జంక్షన్‌’ వద్దకు రాగా.. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే నరేంద్రకుమార్‌తో కలసి ఈమె ఆయనకు పుష్పగుచ్ఛమిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఆ సందర్భంగా చంద్రబాబు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈమె మృతికి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే నరేంద్రకుమార్‌ భార్య జ్యోతిర్మయి, రాష్ట్ర నాయకురాలు చందు శోభారాణి, తెలుగు మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు మలినేని రుక్మిణి, స్థానిక పార్టీ శ్రేణులు సంతాపం తెలిపాయి.
ఆమె మరణం తీరనిలోటు: చంద్రబాబు
ఈనాడు డిజిటల్‌, అమరావతి:  పెదకాకాని పంచాయతీ సర్పంచ్‌ మండే మాధవీలత అకాల మరణం బాధాకరమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్థానిక నాయకత్వానికి మాధవీలత మరణం తీరనిలోటు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’నని ఆయన ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా బలపరచిన సర్పంచ్‌ అభ్యర్థినిగా గెలుపొందిన ఈమె మృతిచెందడం విషాదకరమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని