పాజిటివ్‌ కేసుల శాతం 11.71
Published : 16/05/2021 05:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాజిటివ్‌ కేసుల శాతం 11.71

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ఇప్పటి వరకు 14,91,680 మందికి కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించినట్టు కలెక్టరు ఇంతియాజ్‌ తెలిపారు. పాజిటివ్‌ కేసుల శాతం సగటున 5.03 శాతంగా ఉందన్నారు. ఫిబ్రవరిలో 0.4 శాతం ఉండగా, మార్చి నాటికి 1.46 శాతానికి చేరినట్టు పేర్కొన్నారు. ఇది మే నాటికి 11.71 శాతానికి చేరిందని, గత నాలుగు రోజులుగా పాజిటివ్‌ కేసుల్లో తగ్గుదల కన్పించినట్టు వివరించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్‌ సింఘాల్‌ కొవిడ్‌ పరిస్థితులపై శనివారం సాయంత్రం జూమ్‌ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి కలెక్టరు పాల్గొని జిల్లాలోని పరిస్థితులను వివరించారు. శనివారం ఒక రోజున 22,575 మందికి కొవిడ్‌ టీకా వేసినట్టు తెలిపారు. 5,463 నమూనాల నివేదికలు రాగా, వీటిలో 412 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని