సరైన చికిత్స అందించని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు
Published : 16/05/2021 06:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరైన చికిత్స అందించని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే : కొవిడ్‌ రోగులకు సరైన చికిత్స అందించని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం నిమ్రా ఆసుపత్రిలో కొవిడ్‌ రోగులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్‌ ఫిర్యాదుపై మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, శాసనసభ్యులు వంశీమోహన్‌, కృష్ణప్రసాద్‌, కలెక్టరు ఇంతియాజ్‌, సంయుక్త కలెక్టరు శివశంకర్‌ శనివారం వైద్యశాలను తనిఖీ చేశారు. రోగుల బంధువులతో మాట్లాడారు. సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఏ ఒక్క కొవిడ్‌ రోగి ప్రాణాలు కూడా కోల్పోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని, అయినా కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అందక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. నోడల్‌ అధికారులు ఆయా ఆసుపత్రుల్లో వైద్య సేవలపై పర్యవేక్షణ చేయాలని, నిర్లక్ష్యం కనబడితే ఉన్నతాధికారులకు నివేదికలు అందించాలని, దాని ప్రకారం ఆయా వైద్యశాలలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యం తీరును మంత్రులు, అధికారులకు వివరించి కన్నీళ్లు పెట్టుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని