కరోనా బాధితులకు అండ
Published : 16/05/2021 06:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా బాధితులకు అండ

ఐసోలేషన్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కుమారస్వామి, తదితరులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా గోపాలరావు ఠాకూర్‌ స్మారక సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాన్ని భాజపా సీనియర్‌ నేతలు చిగురుపాటి కుమారస్వామి, మధుకర్‌జీలు శనివారం ప్రారంభించారు. స్థానిక బస్టాండ్‌ సమీపంలోని రీచ్‌ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో మొత్తం 50 పడకలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇళ్లలో ప్రత్యేక గది లేని కొవిడ్‌ బాధితులకు కేంద్రం ఓ వరమని కుమారస్వామి పేర్కొన్నారు. భాజపా నేతలు నాదెండ్ల మోహన్‌, సమితి ప్రతినిధులు శామ్యూల్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని