Raghurama: గుంటూరు జైలుకు తరలింపు 
Updated : 16/05/2021 18:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raghurama: గుంటూరు జైలుకు తరలింపు 

గుంటూరు: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం జీజీహెచ్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి నుంచి నేరుగా జైలుకు తీసుకెళ్లారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జిల్లా జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై సీఐడీ పోలీసులు రఘురామను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

మెడికల్‌ బోర్డు నివేదికలో జాప్యం

మరోవైపు రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై కాసేపట్లో జిల్లా కోర్టుకు మెడికల్‌ బోర్డు నివేదిక ఇవ్వనుంది. జీజీహెచ్‌లో ఎంపీకి వైద్య పరీక్షలు పూర్తిచేసిన మెడికల్‌ బోర్డు.. కోర్టుకు సమర్పించే నివేదికను సిద్ధం చేసింది. కోర్టు ఆదేశాలతో రఘురామ గాయాలపై గత రాత్రి నుంచి పరీక్షలు కొనసాగాయి. అనంతరం నివేదికను తయారు చేసేందుకు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి నేతృత్వంలో మెడికల్‌ బోర్డు ఏర్పాటైంది. బోర్డు సభ్యులుగా జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ నరసింహం, ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వరప్రసాద్‌, జనరల్‌ సర్జన్‌ సుబ్బారావు ఉన్నారు. ఉదయం 10.30 గంటలకే జిల్లా కోర్టుకు.. మధ్యాహ్నం 12 గంటల్లోపు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు మెడికల్‌ బోర్డు నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. పరీక్షలు ముగియకపోవడంతో జాప్యం జరిగింది.  పరీక్షలు ముగిసిన తర్వాత జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వైద్య బృందం నివేదిక అందించింది. జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ నివాసానికి ప్రత్యేక మెసెంజర్‌ ద్వారా జిల్లా కోర్టు నివేదిక పంపింది. దీనిపై మరికాసేపట్లో విచారణ చేపట్టి నిర్ణయం తీసుకునే అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని