ap news: కేంద్రమంత్రులతో సీఎం జగన్‌ భేటీ 
logo
Updated : 10/06/2021 18:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ap news: కేంద్రమంత్రులతో సీఎం జగన్‌ భేటీ 

దిల్లీ: దిల్లీలో సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. రెండ్రోజుల పర్యటన నిమిత్తం దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రులతో వరుస భేటీల్లో పాల్గొంటున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమైన సీఎం జగన్‌  పోలవరంపై విస్తృతంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. రూ.55,656.87 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని కోరారు. 2022 జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న సీఎం.. ప్రాజెక్టు పెరిగిన అంచనాలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. రీయింబర్స్‌మెంట్‌కు కాంపోనెంట్‌ వైజ్‌ ఎలిజిబిలిటికీ పరిమితం చేయవద్దని, పోలవరం స్టాకింగ్‌ పనుల పర్యావరణ అనుమతుల పూర్తి చేయాలని కోరారు.

అంతక ముందు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. రాత్రి 9గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం భేటీ కానున్నారు. రేపు ఉదయం వాణిజ్య, రైల్వే, పెట్రోలియం శాఖ మంత్రులతో భేటీ కానున్నారు. రాత్రికి దిల్లీలోనే బస చేయనున్న సీఎం.. రేపు మధ్యాహ్నం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, బాలశౌరి, మోపిదేవి వెంకటరమణ సహా మరికొందరు ఎంపీలు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని