392 పాజిటివ్‌ కేసుల నమోదు
logo
Published : 13/06/2021 03:38 IST

392 పాజిటివ్‌ కేసుల నమోదు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం 392 కేసులు నమోదు కాగా, ఐదుగురు వైరస్‌తో మృతి చెందారు. మొత్తం బాధితుల సంఖ్య 95,203కు చేరింది. 7,731 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 86,443 మంది వైరస్‌ను జయించి డిశ్ఛార్జి అయ్యారు. జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 1029కు చేరింది.


రాష్ట్రానికి 3.60 లక్షల టీకా డోసులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రానికి మరో 3.60లక్షల కొవిషీల్డ్‌ టీకాలు కేటాయించారు. ఇవి దిల్లీ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో శనివారం రాత్రి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాయి. వీటిని రోడ్డు మార్గంలో గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు.


అధికారులు ఉందన్నారు.. కేంద్రాల్లో లేదన్నారు..!

విజయవాడ నగరంలోని 12 శాశ్వత వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో శనివారం వ్యాక్సినేషన్‌ ఉంటుందని, 45 ఏళ్ల పైనవారు, వృద్ధులకు మొదటి, రెండో డోసులను వేస్తారని నగరపాలక కమిషనర్‌ ప్రకటించారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు కూడా వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. దీంతో ప్రజలు, వృద్ధులు, మహిళలు వ్యాక్సిన్‌ కేంద్రాల వద్దకు వచ్చి ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. పటమట జీడీఈటీ పాఠశాల వ్యాక్సిన్‌ కేంద్రం, కృష్ణలంక శాంపిల్‌ బిల్డింగ్‌ కేంద్రం, కృష్ణలంక ఏపీఎస్‌ఆర్‌ఎంసీ పాఠశాలలో వ్యాక్సినేషన్‌ లేక ప్రజలు ఇబ్బందిపడ్డారు.

-ఈనాడు, విజయవాడ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని