జిల్లా ఆసుపత్రిలో మృతదేహం తారుమారు
logo
Published : 13/06/2021 03:38 IST

జిల్లా ఆసుపత్రిలో మృతదేహం తారుమారు

మచిలీపట్నం, న్యూస్‌టుడే: మచిలీపట్నంలోని జిల్లా ఆసుపత్రిలో శవం తారుమారైన సంఘటన చోటుచేసుకుంది. పామర్రు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో మృతిచెందారు. శనివారం మృతుని కుటుంబ సభ్యులు వచ్చి మార్చురీ నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా వేరే వ్యక్తిది ఉండటంతో అదే వాహనంలో తిరిగి ఆసుపత్రికి తీసువచ్చి, తమ కుటుంబీకుని మృతదేహాన్ని తీసుకెళ్లారు. తమ తప్పిదంతోనే హడావుడిలో వేరే వ్యక్తిది తీసుకెళ్లినట్లు వారు చెబుతున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆసుపత్రుల్లో ఇలాంటివి జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఆసుపత్రి ఆర్‌ఎంవో డా.అల్లాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిశీలించుకుని మృతదేహాన్ని తీసుకెళ్లాల్సి ఉండగా వాళ్లే వేరే వ్యక్తిది తీసుకెళ్లి మళ్లీ వెనక్కి తెచ్చినట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని