రూ.35 లక్షల విలువైన గుట్కా పట్టివేత
logo
Published : 13/06/2021 03:47 IST

రూ.35 లక్షల విలువైన గుట్కా పట్టివేత


కంచికచర్ల : గోదాం నుంచి సరకును బయటకు తీస్తున్న పోలీసులు

ఉయ్యూరు, న్యూస్‌టుడే: గుట్కా మాఫియాకు పేరుగాంచిన ఉయ్యూరు పట్టణంలో వారం రోజుల వ్యవధిలోనే మరోసారి శనివారం విజయవాడ టాస్క్‌ఫోర్సు బృందం గోదాములపై దాడి చేసి పెద్దఎత్తున గుట్కా, విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుంది. ఈ కేసులో ఎన్‌.సుబ్బారావు, ధర్మేంద్రకుమార్‌లను అరెస్టు చేశారు. సుబ్బారావును ఇటీవలే పట్టణ పోలీసులు గుట్కా, మద్యం అమ్మకాల కేసులో అరెస్టు చేయడం జరిగింది. ఆ కేసులో రూ.11.50 లక్షల గుట్కాలను పట్టకున్నారు. మళ్లీ అతికొద్ది రోజుల్లోనే ఈ దాడులు జరిగాయి. కేసును ఉయ్యూరు పట్టణ ఎస్‌ఐ అహ్మద్‌ షరీఫ్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కంచికచర్ల, న్యూస్‌టుడే: కంచికచర్లలో ఒకే వ్యక్తికి చెందిన పలు గోదాముల్లో నందిగామ గ్రామీణ సీఐ ఐ.వి.నాగేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన దాడుల్లో రూ.10 లక్షల విలువైన గుట్కా, విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కంచికచర్లకు చెందిన దాసా శేఖర్‌ తన గోదాముల్లో నిషేధిత గుట్కా, విదేశీ సిగరెట్లను అక్రమంగా నిల్వ ఉంచాడనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. గోదాముల్లో పెద్ద మొత్తంలో దాచిన గుట్కా, విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అతనిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్‌.రంగనాథ్‌ చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని