డీపీవో జ్యోతి బాధ్యతల స్వీకరణ
logo
Published : 14/06/2021 04:14 IST

డీపీవో జ్యోతి బాధ్యతల స్వీకరణ

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీవో)గా ఎ.డి.జ్యోతి ఆదివారం నగరంలోని డీపీవో విడిది కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో కేడర్‌కు చెందిన ఈమె.. చిత్తూరు జిల్లా మెప్మా పీడీగా పని చేస్తూ, డీపీవోగా కృష్ణాజిల్లాకు బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ డీపీవోగా పని చేసిన పి.సాయిబాబును (డిప్యూటీ కలెక్టరు స్థాయి) మాతృ సంస్థకు పంపిన విషయం తెలిసిందే. బాధ్యతలను స్వీకరించిన జ్యోతిని పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర నాయకుడు రమణ, జిల్లా సంఘం అధ్యక్షుడు కొత్త శ్రీనివాసరావు, సంఘ నాయకులు రామ్మోహనరావు, బసవ లింగేశ్వరరావు, వెంకటరత్నం, బొమ్మసాని తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. డీపీవో మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చేలా కృషి చేయాలని ఆమె సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని