నందిగామలో 41 మి.మీ. వర్షం
logo
Published : 14/06/2021 04:14 IST

నందిగామలో 41 మి.మీ. వర్షం

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో నాలుగు మండలాలు మినహా మిగతా అన్ని మండలాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నందిగామలో అత్యధికంగా 41 మి.మీ., విస్సన్నపేటలో అత్యల్పంగా ఒక మి.మీ. వర్షం పడింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 636.4 మి.మీ. వర్షం పడింది. చందర్లపాడులో 38.6, జి.కొండూరు 38.2, కంచికచర్ల 34, పెదపారుపూడి 29.6, పెడన 28.6, అవనిగడ్డ 27.2, గుడ్లవల్లేరు 26.2, గన్నవరం 23.4, మచిలీపట్నం, కృత్తివెన్ను 21.6, మైలవరం 18.6, మోపిదేవి, ఇబ్రహీంపట్నం 17, గూడూరు 16.8, గుడివాడ, కైకలూరు 16.2, నాగాయలంక 14.8, ముదినేపల్లి 14, వత్సవాయి 13.6, బంటుమిల్లి 10.6, పెనుగంచిప్రోలు, నందివాడ, విజయవాడ 10.4, నూజివీడు 8.2, మిగతా మండలాల్లో 1.8 మి.మీ. నుంచి 9.2 మి.మీ. వరకు వర్షపాతం నమోదైంది. ఎ.కొండూరు, ముసునూరు, రెడ్డిగూడెం, మొవ్వ మండలాల్లో వర్షఛాయలు లేవు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని