జాతీయ రహదారికి సరికొత్త సొబగులు
logo
Published : 14/06/2021 04:14 IST

జాతీయ రహదారికి సరికొత్త సొబగులు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే  

16వ జాతీయ రహదారి కొత్త రూపు సంతరించుకుంటోంది. భారతమాల యోజన పథకం ద్వారా దాదాపు రూ.512 కోట్ల వ్యయంతో చిన్నఆవుటపల్లి నుంచి కలపర్రు వరకు ఆరు వరసలుగా విస్తరించే పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే సర్వీసు రహదారులు, వంతెనల నిర్మాణం పూర్తయి, ప్రధాన మార్గం కూడా రాకపోకలకు అనువుగా రూపుదిద్దుకుంది. మొత్తం 27.4 కి.మీ. మేర విస్తరణ చేపట్టగా, ఇరువైపులా సోలార్‌ విద్యుద్దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని పక్కనే విస్తరించి ఉన్న గ్రామాల సర్వీసు రహదారులకు ఉపయుక్తంగా ఉండేలా కూడా వంతెనల వెంబడి దీపాలు అమర్చుతున్నారు. వీటితో పాటు ప్రతి గ్రామానికి బస్‌ షెల్టర్‌ నిర్మిస్తున్నారు. తేలప్రోలు ఉషారామా కళాశాల వద్ద వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తూ, అక్కడ మరుగుదొడ్లు సముదాయం కూడా నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ రహదారి సువిశాలంగా మారడంతో పాటు, కొత్త సొబగులతో ప్రయాణిలకు సరికొత్త అనుభూతి కల్గిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని