జగన్మాతను దర్శించుకున్న సభాపతి
logo
Published : 14/06/2021 04:14 IST

జగన్మాతను దర్శించుకున్న సభాపతి

దర్శనానికి వస్తున్న సభాపతి తమ్మినేని సీతారామ్‌ దంపతులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే:  ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్‌ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వారిని దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వారికి ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఏఈవో తిరుమలేశ్వరరావు ఆయనకు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని