ఆనందయ్య మందు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
logo
Updated : 14/06/2021 05:40 IST

ఆనందయ్య మందు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

తాడికొండ, న్యూస్‌టుడే:  అనుమతులు లేకుండా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య మందుని విక్రయిస్తున్న వ్యక్తిని తాడికొండ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎస్‌.ఐ. వెంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా నివారణకు ఇచ్చే ఆనందయ్య మందును గుంటూరు జిల్లా మోతడక గ్రామానికి చెందిన అన్నె కాంతారావు పది రోజులుగా తీసుకువచ్చి అనధికారకంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించి అతని వద్ద ఉన్న 150 పొట్లాల మందును స్వాధీనం చేసుకున్నారు. గతంలో 750 పొట్లాలను ఒక్కొక్కటి రూ.200 చొప్పున విక్రయించినట్లు నిందితుడు అంగీకరించాడు. ఆ పొట్లాలు విక్రయించగా వచ్చిన రూ.1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని