కొవిడ్‌ మృతుల అంత్యక్రియలకు సాయం
logo
Published : 14/06/2021 04:23 IST

కొవిడ్‌ మృతుల అంత్యక్రియలకు సాయం

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొవిడ్‌ బారినపడి మరణించిన వారి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15వేలు వారి కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డా.ఎం.సుహాసిని ఆదివారం రాత్రి విడుదలు చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌తో మృతిచెందినట్లు వైద్యుడు ధ్రువీకరించిన పత్రం, వారి కుటుంబ సభ్యుల నామినీ దారులకు మట్టిఖర్చులు నిమిత్తం ఆ నగదు అందజేస్తామన్నారు. సంబంధిత ధ్రువపత్రాలతో స్థానిక సచివాలయాలు, ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని