గంజాయి రవాణా ముఠా కోసం గాలింపు
logo
Published : 14/06/2021 04:23 IST

గంజాయి రవాణా ముఠా కోసం గాలింపు

మంగళగిరి, న్యూస్‌టుడే: గంజాయి రవాణా ముఠా ఆచూకీ కోసం గాలిస్తున్నామని మంగళగిరి నగరంలోని ఉత్తర మండలం డీఎస్పీ డి.దుర్గాప్రసాద్‌ ఆదివారం తెలిపారు. గ్రామీణ పోలీసు స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నం నుంచి చెన్నైకి రవాణా అవుతున్న 120 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులి్న అరెస్టు చేశామన్నారు. కాజ టోల్‌ప్లాజా వద్ద గ్రామీణ ఎస్‌.ఐ. శ్రీనివాసరెడ్డి తనిఖీ చేయగా 120 కిలోల గంజాయి లభించిందని ఆయన తెలిపారు. ఇద్దరు నిందితుల్ని కోర్టులో హాజరు పరచనున్నట్టు చెప్పారు. గంజాయి రవాణా వెనుక ఉన్న ముఠా ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని