హోం గార్డుల పెద్ద మనసు
logo
Published : 16/06/2021 02:59 IST

హోం గార్డుల పెద్ద మనసు


అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ నుంచి చెక్కు స్వీకరిస్తున్న కిరణ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : గుంటూరు అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో హోం గార్డుగా పనిచేసిన టి.కిరణ్‌కుమార్‌ (45) ఏప్రిల్‌ 30న కొవిడ్‌తో చికిత్సపొందుతూ మృతిచెందారు. సహచర హోంగార్డులు తమ ఒకరోజు వేతనం రూ. 2.33 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తం చెక్కును అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ చేతుల మీదగ మంగళవారం తన కార్యాలయంలో మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్‌ఐ రాజారావు, హోంగార్డుల సంఘం ఉపాధ్యక్షుడు నిరీక్షణరావు, ఎన్‌సీఓ రామకృష్ణ, సుధీర్‌బాబు, క్రాంతి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని