బీసీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రకటించాలి
logo
Published : 16/06/2021 03:39 IST

బీసీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రకటించాలి


మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు వినతి పత్రం ఇస్తున్న శంకరరావు

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: వైఎస్సార్‌ బడుగు వికాసం తరహాలో బీసీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు. ఎంజీరోడ్డులోని ఓ హోటల్లో ఉన్న రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సీహెచ్‌ శ్రీనివాస వేణుగోపాలకృష్ణను మంగళవారం కేసన కలిసి వినతిపత్రం అందజేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. బీసీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అనుసరించాల్సిన వివిధ అంశాలను మంత్రికి వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని