‘వ్యాక్సిన్‌ పేరుతో కేంద్రం దోపిడీ’
logo
Published : 16/06/2021 03:39 IST

‘వ్యాక్సిన్‌ పేరుతో కేంద్రం దోపిడీ’


గోడపత్రిక ఆవిష్కరిస్తున్న మస్తాన్‌వలి, రాజీవ్‌రతన్‌, రవికాంత్‌

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : వ్యాక్సిన్‌ పేరుతో మోదీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌వలి దుయ్యపట్టారు. మంగళవారం ఆంధ్రరత్నభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 75 శాతం వ్యాక్సిన్‌.. దేశ ప్రజలకు ఉచితంగా సరఫరా చేస్తామన్న మోదీ భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ కంపెనీలకు ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత పూర్తిగా మారిపోయిందన్నారు. టీకాతోపాటు పెట్రోల్‌ ధరలు పెంచుతూ కేంద్రం ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. ఎన్నికలొచ్చినపుడు ధరలు తగ్గుతాయని, ఎన్నికలు పూర్తి కాగానే పెరగటం మొదలవుతాయని విమర్శించారు. వీటిపై ప్రశ్నిస్తే, మా చేతుల్లో లేవని భాజపా నేతలు తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. మోదీ, ఆయన సహచరులు చేస్తున్న దోపిడీని ప్రశ్నించే ఏకైక నాయకుడు రాహుల్‌గాంధీ మాత్రమేనని చెప్పారు. ఈ నెల 19న రాహుల్‌గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు చేసుకోవద్దని, కరోనా బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారని తెలిపారు. ఏపీసీసీ ఈ నెల 15 నుంచి 19 వరకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. మోదీని ప్రశ్నించలేని స్థితిలో వైకాపా, తెదేపాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ పుట్టినరోజు కార్యక్రమాల గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పరసా రాజీవ్‌రతన్‌, నూతలపాటి రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని