ఆస్తిపన్ను పెంపు 15శాతానికి మించదు: బొత్స
logo
Published : 16/06/2021 20:16 IST

ఆస్తిపన్ను పెంపు 15శాతానికి మించదు: బొత్స

అమరావతి: కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే ఆస్తిపన్ను విధానంలో మార్పులు చేశామని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆస్తి పన్ను పెంపు ఎట్టి పరిస్థితుల్లో 15 శాతానికి మించదని స్పష్టం చేశారు. ఇంటి అద్దెపైనా పారదర్శక విధానం తెస్తున్నామని వివరించారు. భాజపా నేతలు తమకు నీతులు చెప్పాల్సిన పనిలేదని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

పన్నుల పెంపునకు నిరసనగా భాజపా శ్రేణులు రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు చేపట్టాయి. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే.. నూతన పన్నుల విధానాన్ని తీసుకొచ్చి ప్రజలపై మరింత భారం మోపారని భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని