గ్రూప్-1 అభ్యర్థులకు అన్యాయం చేశారు: లోకేశ్‌
logo
Published : 17/06/2021 01:41 IST

గ్రూప్-1 అభ్యర్థులకు అన్యాయం చేశారు: లోకేశ్‌

అమరావతి: గ్రూప్-1 అభ్యర్థుల ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత భవితని దెబ్బతీసే విధంగా గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి వేలాది మంది అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. దొడ్డిదారిలో తమ వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు చేసిన కుట్ర బయటపడిందన్నారు. విజయానికి ఇది మొదటి మెట్టు అని.. ఆఖరికి న్యాయమే గెలుస్తుందన్నారు. అభ్యర్థులంతా ధైర్యంగా ఉండాలని, అర్హులకే ఉద్యోగాలు అనే డిమాండ్‌తో పోరాటం కొనసాగిద్దామని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని