కుటుంబ కలహాలతో అల్లుడి హత్య
logo
Updated : 18/06/2021 02:39 IST

కుటుంబ కలహాలతో అల్లుడి హత్య

హత్యకు గురైన నరేష్‌ మృతదేహం

తాడేపల్లి, న్యూస్‌టుడే: భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం భర్త హత్యకు దారితీసింది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ సమీపంలోని రామవరప్పాడుకు చెందిన కారు డ్రైవర్‌ నరేష్‌.. గుంటూరు జిల్లాలోని నులకపేటకు చెందిన లావణ్యతో కొన్నేళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గత కొంతకాలంగా దంపతుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. దీంతో లావణ్య పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం రాత్రి విజయవాడ నుంచి నులకపేట వచ్చిన నరేష్‌... భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఇంట్లోని అందరినీ దూషించి ఆమెపై దాడికి దిగుతున్న క్రమంలో.. లావణ్య బంధువులు కలుగజేసుకుని నరేష్‌ తలపై రాడ్డుతో కొట్టారు. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌కి సమాచారం అందించారు. అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. విజయవాడ రామవరపాడులో ఉన్న మృతుని తండ్రి కృష్ణ గురువారం ఉదయం తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకుని తన కుమారుడిని కావాలనే చంపారని ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని