నాసిరకం విత్తనాలు విక్రయిస్తే చర్యలు
logo
Published : 18/06/2021 02:38 IST

నాసిరకం విత్తనాలు విక్రయిస్తే చర్యలు

వ్యవసాయ ప్రయోగశాలలో జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న జేడీఏ విజయభారతి తదితరులు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: నాసిరకం విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను విక్రయించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు ఎం.విజయ భారతి చెప్పారు. ప్రత్తిపాడులో తుది దశలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం ఏడు ప్రయోగశాలలను వైఎస్‌ఆర్‌ జయంతి రోజైన జులై 8న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన వ్యవసాయ అధికారులను ప్రయోగశాలల్లో నియమిస్తున్నట్లు చెప్పారు. రైతులే విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను ఈ ప్రయోగశాలకు తీసుకువచ్చి నాణ్యతను తెలుసుకోవచ్చని అన్నారు. వ్యవసాయం, ఉద్యాన, పాడి పరిశ్రమ, మత్య్స పరిశ్రమ రంగాల్లోని ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను పరీక్షించి తెలియజేస్తామన్నారు. జిల్లాలోని 835 గ్రామీణ, 13 పట్టణ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ముంగిటకే వ్యవసాయ, అనుబంధ సేవలను అందించనున్నామని పేర్కొన్నారు. రేపల్లె, బాపట్ల, వినుకొండ నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం గొట్టిపాడులోని శ్రీకృష్ణవేణి సీీడ్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను తనిఖీ చేశారు. ఏడీఏ కేవీ శ్రీనివాసరావు, ఏవో విజయ్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని