కరోనాతో మృతి చెందిన ఎస్సీ, బీసీ కుటుంబాలకు రూ.5 లక్షల రుణం
logo
Published : 18/06/2021 02:38 IST

కరోనాతో మృతి చెందిన ఎస్సీ, బీసీ కుటుంబాలకు రూ.5 లక్షల రుణం

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో కరోనాతో మృతి చెందిన ఎస్సీ, బీసీ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం అందజేయనున్న రూ.5 లక్షల రుణం కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నామని జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఇన్‌ఛార్జి ఈడీ ప్రేమకుమారి, బీసీ కార్పొరేషన్‌ ఇన్‌ఛార్జి ఈడీ ఆనంద్‌నాయక్‌ గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఇంటి పెద్ద మరణించి జీవనాధారం కోల్పోయిన కుటుంబ సభ్యులను గుర్తించి నివేదికలు అందజేయాలని మున్సిపల్‌, మండలాల అధికారులను కోరామన్నారు. ప్రభుత్వం అందజేసే రూ.5 లక్షల రుణంలో రూ.లక్ష రాయితీ, మిగిలిన రూ.4 లక్షలను వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. వయసు 18 నుంచి 60 సంవత్సరాల లోపు వారు మరణించిన వారి కుటుంబ సభ్యులు అర్హులన్నారు. దరఖాస్తుకు బియ్యం కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, కుల, మరణ ధ్రువీకరణ పత్రాల నకళ్లను జత చేసి ఎస్సీలు ఈనెల 20 లోపు గుంటూరు నగరం బ్రాడీపేట 4/17లోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో, బీసీలు ఈనెల 23 లోపు కన్నావారితోటలోని బీసీ కార్పొరేషన్‌ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు జిల్లా కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని