ఆర్థిక ఇబ్బందులతో వివాహిత బలవన్మరణం
logo
Published : 18/06/2021 02:38 IST

ఆర్థిక ఇబ్బందులతో వివాహిత బలవన్మరణం

గుడివాడ, న్యూస్‌టుడే : ఆర్థిక ఇబ్బందులతో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుడివాడలో గురువారం చోటు చేసుకుంది. ఆర్టీసీ కాలనీకి చెందిన ఉమాదేవికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె శిల్ప(33)కు కొన్నేళ్ల కిందట యార్లగడ్డ సాయికృష్ణతో వివాహమైంది. హైదరాబాద్‌లో కాపురం ఉంటున్న వారికి ఇద్దరు కుమారులు. సాయికృష్ణ బ్రిక్స్‌ వ్యాపారం నిర్వహిస్తూ అప్పుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో మూడు నెలల కిందట శిల్ప పిల్లలతో పుట్టింటికి వచ్చింది. గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటి ముందు వరండాలో ఉండగా ఆమె వెనుక గదిలోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. పిల్లలు గమనించి అమ్మమ్మకు చెప్పారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కిందకు దించి చూడగా మృతి చెందినట్లు గుర్తించారు. తల్లి ఉమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. చిన్నారులు తల్లి మృతదేహం చూస్తూ రోదించడం చూపరులను కలచివేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని